Health Benefits Of Yoga: యోగా అనేది ఆసనాలు, వ్యాయామం మాత్రమే కాదు ఇది ఒక సంపూర్ణ జీవన విధానాన్ని అలాగే ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. యోగా చేయడం వల్ల శరీరానికి కలిగే లాభాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం.
యోగా చేయడం వల్ల శరీరానికి కలిగే లాభాలు:
గుండె కు మేలు: రోజు ఉదయం యోగా చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. యోగా వల్ల గుండె స్పందన రేటు నియంత్రణలో ఉండటంతో పాటు గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని యోగా నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ వ్యవస్థ: మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం ఇతర జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీర్ణవ్యవస్థను మెరుగపరిచే ఆసనాలు చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
అధిక బరువు: అధిక అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా ప్రతిరోజు యోగా చేయడం మంచిది. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
రోగ నిరోధక శక్తి: క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల తరచూ వచ్చే ఇన్ఫెక్షన్, ఇతర వ్యాధుల బారిన పడుకుండా ఉండవచ్చు.
ఒత్తిడి: ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు యోగ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యోగ వల్ల ఒత్తిడి హార్మోన్స్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
నొప్పి నివారణ: కీళ్ల నొప్పి, మెడ నొప్పి, ఆర్థరైటిస్‌తో బాధపడేవారు కూడా యోగా చేయడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోజు ఉదయం శరీర నొప్పులకు సంబంధించిన ఆసనాలు చేయండి.
శ్వాసకోశ సమస్యలకు: ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో యోగా కీలక ప్రాత పోషిస్తుంది. ప్రతిరోజు శ్వాసకు సంబంధించిన వ్యాయామం చేయడం చాలా మంచిది.
మానసిక స్థితి: యోగా తరచుగా చేయడం వల్ల డిప్రెషన్, విచారం నుంచి ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.
యోగా వల్ల ఆరోగ్యం, ఆనందం పొందవచ్చు. ఇది శారీరక, మానసిక, భావోద్వేగ ప్రయోజనాలను అందించడంలో సహాయపడుతుంది. కాబట్టి పిల్లలు, పెద్దలు తప్పకుండా ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే యోగా చేయడం మంచిది.