Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్CM Revanth and team Medigadda tour: మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు

CM Revanth and team Medigadda tour: మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు

గులాబీ నేతలను రమ్మంటే రాలేదన్న సీఎం

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ టూర్లో ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి బృందం. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లో డ్యామేజ్ జరిగిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం.

- Advertisement -

అంతకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ పై సీఎం రేవంత్ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి…97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు… పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదు. కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు… వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి.

మొత్తానికి మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News