Tuesday, October 8, 2024
Homeపాలిటిక్స్Chalo Nalgonda: ఛలో నల్గొండలో గులాబీ నేతలు

Chalo Nalgonda: ఛలో నల్గొండలో గులాబీ నేతలు

భవిష్యత్తులో మరింత ఉధృతం

తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనానికి దాసోహమన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నల్లగొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ బృందం. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి చలో నల్గొండ బహిరంగ సభకు బయలుదేరిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు.

- Advertisement -

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ఈరోజు పార్టీ ప్రజా ప్రతినిధులను సీనియర్ నాయకులను అంత నల్గొండ బహిరంగ సభకు బయలుదేరి వెళుతున్నాము, తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెత్తనాన్ని గత పది సంవత్సరాలుగా అడ్డుకున్నది మా పార్టీ ప్రభుత్వం, నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం కేవలం రెండు నెలల్లోని కృష్ణ గోదావరి నది జలాల బోర్డులకు నదుల నిర్వహణను అప్పజెప్పింది. తెలంగాణ రైతాంగం భవిష్యత్తును అంధకారం చేసే ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మా పార్టీ వివరంగా గళం ఎత్తింది. నది జలాల పరిరక్షణ కోసం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈరోజు నల్గొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం తోకముడిచింది, నిన్న అసెంబ్లీలో అబద్దాలను ప్రచారం చేసింది. తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియని చెప్పాల్సిన అవసరం మా పైన ఉన్నది, ఈరోజు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రజలకు నది జలాల పైన, వాటిని కేంద్రానికి అప్పజెప్పితే వచ్చే నష్టాల పైన సభలో వివరిస్తారు. తెలంగాణ నదీ జలాల పైన కేంద్రం పెద్దనాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోము. ఈరోజు ప్రారంభమైన జల ఉద్యమం మొదటి అడుగు మాత్రమే, భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తాం” అని కడియం స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News