Thursday, November 21, 2024
Homeపాలిటిక్స్Hyd: హరీష్ రాజీనామాకు రేవంత్ డిమాండ్..బాధిత బాలింతలకు పరిహారంగా కోటి ఇవ్వాలి

Hyd: హరీష్ రాజీనామాకు రేవంత్ డిమాండ్..బాధిత బాలింతలకు పరిహారంగా కోటి ఇవ్వాలి

హైదరాబాద్ లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం బాలింతలను కాపాడలేకపోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైద్యంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని.. ప్రభుత్వ వైఖరి వల్లనే ప్రైవేట్ వైద్యం ఇక్కడ అభివృద్ధి చెందుతోందని రేవంత్ ఆరోపించారు. ప్రపంచ స్థాయి అని చెప్పుకుంటున్న హైదరాబాద్ లో ఇంత ఘోరమా ? ప్రభుత్వ వైద్యం పై పూర్తిగా నమ్మకం పోతోందని రేవంత్ నిప్పులు చెరిగారు. మృత్యువాత పడ్డ పేద బాధిత కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని రేవంత్ డిమాండ్ చేశారు.

- Advertisement -

హైదరాబాద్ లోనే ఇలా ఉంటే ఇక మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని.. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ప్రజలకు భయం వేస్తోందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాటలకే పరిమితం అయ్యారు. ఈ సంఘటనకు ఆయనే బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్రణ అపరేషన్ లో ఆపరేషన్ వికటించి నలుగురు బాలింతలు గతంలో చనిపోగా తాజాగా మరో ఇద్దరు బాలింతల మరణంపై రేవంత్ సీరియస్ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News