రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన బిజెపి మహాధర్నాకు చేవెళ్ల నియోజకవర్గ సీనియర్ నేత వర్రీ తులసీరామ్ విజయ్ కుమార్, శంకర్ పల్లి మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.
వర్రీ తులసిరామ్ విజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు కట్టి ఇవ్వడంలో పూర్తిగా విఫలం అయింది అన్నారు. కేంద్రం నిధులు కేటాయించిన వాటిని దారి మళ్లిస్తున్నారని విమర్శించారు.
కెసిఆర్ నిరంకుశ అవినీతి పాలన కు ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు అని అన్నారు . ఈ సమావేశంలో శంకర్ పల్లి మండల అధ్యక్షుడు బసగళ్ల రాములు గౌడ్ ఉపాధ్యక్షులు హరినాథ్, ప్రభాకర్ రెడ్డి, బిర్లా సురేష్ మోకిలా బిజెపి ఓబీసీ అధ్యక్షులు మసగొని కృష్ణ, కార్యదర్శి రాజేశ్వర్, బిజె వైఎం అధ్యక్షులు నర్సంపేట లింగం, సింగాపురం రమేష్ తదితరులు పాల్గొన్నారు.