మేడిపల్లి సత్యంపై నాగి శేఖర్ నిప్పులు చెరిగారు. గంగాధర మండలం మధురానగర్ లో బీఆర్ఎస్ నాయకులు నాగి శేఖర్ మాట్లాడుతూ..మేడిపల్లి సత్యం తన నోరును అదుపులో పెట్టుకోవాలని.. నీవు ఒక రాజకీయ వ్యభిచారి అని బ్రోకర్ ఒక జోకర్ అని ఆరోపించారు.
22 సంవత్సరాలు కాంగ్రెస్ లో ఉన్న మాదిగ బిడ్డనైన నన్ను కనీసం గౌరవించ లేదని మండిపడ్డారు. చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులే లేనట్లుగా స్థానికేతరుడైన మేడిపల్లి సత్యంకు టికెట్ ఇచ్చారన్నారు. గెలిచినంక అతను కరీంనగర్లో ఉంటాడో, సిరిసిల్లలో ఉంటాడో, అడవులలో ఉంటాడో తెలియదని.. అడ్రస్ లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలు అగమ్యగోచారం అవుతారని అన్నారు. మేడిపల్లి సత్యం చీకటి బతుకంతా నాకు తెలుసునని, త్వరలో బయటపెడుతా అని ఆయన హెచ్చరించారు.
ఒక శాసనసభ్యుడిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నాడని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మా కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు.