Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Palakurthi: ఏమాయే ఎర్రబెల్లి ? ఎర్రబెల్లికి ఎదురుగాలి?

Palakurthi: ఏమాయే ఎర్రబెల్లి ? ఎర్రబెల్లికి ఎదురుగాలి?

9 ఎండ్ల పాలనలో కొత్త రేషన్ కార్డుల ఉసే లేదు

ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలో పాగా వేసి 15 ఏళ్లు. మూడు సార్లు పాలకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం లేని రాజకీయ చరిత్ర ఎర్రబెల్లిది. 2016లో టిడిపినీ కాదని టిఆర్ఎస్ లో అంతర్గత ఒప్పందాలతో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం చేరానని, పలు రకాల అభివృద్ధి పనులను కొనసాగించారు.

- Advertisement -

తరువాత 2018 ఎన్నికల తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి పదవి దక్కింది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి పదవి చేపట్టి, ప్రమాణ స్వీకారం చేసి కూడా రాష్ట్రంలో ఉన్న లింక్ రోడ్ల సమస్యను పట్టించుకోకుండా కేవలం పాలకుర్తిలో మాత్రమే ఉన్న సమస్యలను పట్టించుకోవడంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడోసారి గెలుపు కోసం తన ఉనికిని చాటుకోవడానికి పాటుపడ్డాడన్న నెపాన్ని మూట కట్టుకోవడం దయాకర్ రావు సొంతం. దయన్న.. దయన్న అంటూ పీఆర్వోలతో పబ్లిసిటీ చేసుకోవటం, మీడియాలో, వాట్సప్ గ్రూపుల్లో ప్రముఖంగా వచ్చేలా ఆర్భాటాలు చేయటం మాత్రమే ఎర్రబెల్లి స్టైల్ ఆఫ్ పబ్లిసిటీ అంటూ పాలకుర్తి ప్రజలు ఈసడించుకుంటుండటం అసలు గ్రౌండ్ రిపోర్ట్.

రోడ్ల అనుమతులను తన శాఖాలో ఉన్న కూడా, తన గుప్పిట్లో ఉంచుకొని కూడా, సంబంధిత జిల్లాల హెడ్ క్వార్టర్ల లింక్ రోడ్లని అభివృద్ధి చేయడంలో విఫలమైనాడు అయినప్పటికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ద్వారా ఇటు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా అత్యంత దయనీయ స్థితిలో లింకు రోడ్లో ఉండడం గమనార్హం అటు సూర్యాపేట జిల్లా లింక్ రోడ్లు కూడా అంతంత మాత్రమే, మిగతా జిల్లాలో కూడా రోడ్డులు సరిగా లేకపోవడం గత తొమ్మిదేళ్ల పాలనలో టిఆర్ఎస్ పాలనకు నిర్వచనం.. పాలకుర్తి నియోజకవర్గం లో ఎక్కడ డబుల్ బెడ్ రూం ఇండ్లు??? ప్రతి నిరుపేదకి రెండు పడకల ఇల్లు అనేది తెలంగాణ ప్రభుత్వం 2018లో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినప్పటికీ, ఇప్పటికీ పాలకుర్తి నియోజకవర్గం లో ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా కొనసాగుతూ కూడా దాదాపుగా పాలకుర్తి నియోజకవర్గం లో పదుల సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లని పంచిన గతి తప్పితే అర్హులైన అందరికీ ఇళ్ల సౌకర్యం కలిపించిన విషయమే లేదు. దేవరుప్పుల మండలంలో మాదాపురం గ్రామంలో 30 కుటుంబాల సొంత జాగాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం తమ పాత ఇళ్లను కూల కొట్టుకొని ప్రభుత్వం నుంచి అందించే ఇళ్ల కోసం వాళ్ళ స్థలాలను కేటాయించుకొని కొత్త ఇంటి కోసం పునాదులు పోసుకొని, బేస్మెంట్ ల రూపంలో, పిల్లర్ల రూపంలో, మధ్యలో ఆగిపోయి అటు స్వంత ఇల్లు లేక, ఇటు బయట ఉండలేక సామాన్య గుడారంలో ఉంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆ 30 కుటుంబాలే దయాకర్ రావు డబుల్ బెడ్ రూమ్లకు పరాకాష్టకు నిదర్శన. ఇప్పుడిప్పుడే వాళ్లకు నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో పనులు పూర్తి కాకపోవడం ఇంకా సమస్యలతో పోరాటం చేస్తున్నారు.

ధర్మపురం గ్రామంలో 20 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు పూర్తయిన లబ్దిదారుల ఎంపిక చేయకపోవడం, గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్రలో భాగంగా వాటిని సందర్శించి వాటిలో మద్యం సీసాలని చూసి అవాక్కయ్యాడు. ఇంకా పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని నిర్మించిన ఇప్పటికీ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయకుండా లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్రూం ఇండ్లు అందని ద్రాక్షే… ఆసరా పెన్షన్ల మంత్రి అయ్యుండి కొత్త పెన్షన్ల పరిస్తితి ఏంటి? ఇది ఇప్పుడు ఇక్కడ బేతాళ ప్రశ్నగా నిలిచింది.

గత పదేళ్లుగా తెరాస ప్రభుత్వం పెన్షన్ల ను 2016/- రూ. లకు పెంచి పెన్షన్లదారుల దృష్టిలో మంచి ప్రభుత్వంగా గుర్తుకు తెచ్చుకున్న కూడా ఇప్పటికీ కొత్త పెన్షన్లను ఇవ్వకుండా జాప్యం చేయడం అందులో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసరా పెన్షన్ల మంత్రిగా ఉన్నవాటికి కొత్త పెన్షన్లని ఇవ్వకపోగా ఈ ఎన్నికల మ్యానిఫెస్టోలో 5016/- పెన్షన్ ఇస్తమనడం సిగ్గు చేటనే విమర్శలు జోరుగా వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News