Saturday, June 29, 2024
Homeపాలిటిక్స్Jeevan Reddy Delhi tour: ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Jeevan Reddy Delhi tour: ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ హై కమాండ్ పిలుపు మేరకు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. గత నాలుగు రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పార్టీలో చేర్చుకోవడం పట్ల గత మూడు రోజులుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

- Advertisement -

ఇటీవల రాష్ట్ర మంత్రి, ప్రభుత్వ విప్ తదితరులు జగిత్యాలలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి వచ్చి బుజ్జగింపులు సైతం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా సీరియస్ గా తీసుకుని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారని సైతం ప్రచారం జరిగింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తన ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తన రాజీనామా పత్రాన్ని సమర్పించడానికి హైదరాబాదుకు వెళ్లిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. సాక్షాత్తు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News