Thursday, July 4, 2024
Homeపాలిటిక్స్Karimnagar: కాంగ్రెస్ శ్రేణులు కలిసి ఉండటాన్నిబిజెపి జీర్ణించుకోలేకపోతోంది

Karimnagar: కాంగ్రెస్ శ్రేణులు కలిసి ఉండటాన్నిబిజెపి జీర్ణించుకోలేకపోతోంది

హామీలు అమలు చేయలేని మోడీ ఓట్లెలా అడుగుతారు

కాంగ్రెస్ శ్రేణులు కలిసి ఉండటాన్ని బిజెపి, బిఆర్ఎస్ లు జీర్ణించుకోలేకపోతున్నాయని, నాయకుల మధ్య చిచ్చులు పెట్టి లబ్ధిపొందేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఏఐసీసీ పేరుతో నకిలీ లెటర్లను సృష్టించి ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. డిసిసి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, చొప్పదండి శాసన సభ్యులు మేడిపల్లి సత్యంలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… తొలి దశ పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీకి భయం పట్టుకుందని, అందుకే రాముని జపం చేసి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

- Advertisement -

భారత సంపదను అదాని, అంబానీలకు ధారాదత్తం చేసిన ఘనత మోడీకి దక్కుతుందన్నారు. సామాన్య ప్రజలకు నీ నుండి ఒరిగింది ఏంటని, నల్లధనాన్ని వెలికి తీసి, పేదల ఖాతాలో వేస్తానన్న సొమ్ము ఏం చేసావో చెప్పాలని మోదీ ప్రభుత్వాన్ని నిలదీశారు. పాంచ్ న్యాయ్ మేనిఫెస్టోతో కాంగ్రెస్ ప్రజల్లో మమేకమైతే, ధరల పెంపుతో బిజెపి ప్రజల నడ్డి విరుస్తుందని తద్వారా తీవ్ర వ్యతిరేకతను కూడగట్టుకుందని అన్నారు. ఐదేళ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఏనాడూ నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలతో మమేకమైన సందర్భాలు లేవు కానీ, నేడు నేతన్నల పరిస్థితిపై ముసలి కన్నీరు కారుస్తున్నాడని దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ నీకెందుకు ఓటేయాలని ప్రశ్నించారు. పార్లమెంట్ పరిధిలోని ప్రజా ప్రతినిధులనైన కనీసం గుర్తు పడతావా, ఏనాడైనా వారితో కరాచలణం చేసావా అని నిలదీశారు. రైతులకు నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేసిన బిజెపికి, ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసిన బీఆర్ఎస్ కు ఓటు అడిగే కనీస హక్కు లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గం పై అవగాహన గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన విద్యావేత్త వెలిచాల రాజేందర్ రావును హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News