Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్KCR bus yatra 2nd day: కేసీఆర్ బస్సు యాత్ర - 2 వ...

KCR bus yatra 2nd day: కేసీఆర్ బస్సు యాత్ర – 2 వ రోజు

భువనగిరి బహిరంగ సభ

సూర్యాపేట నుంచి మధ్యాహ్నం బయలుదేరిన కేసీఆర్, వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకున్నారు. మార్గమధ్యంలో పలు చోట్ల కార్యకర్తలు ప్రజలు అభిమానంతో దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన భువనగిరి రోడ్డు షోలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

సాయంత్రం భువనగిరి లో నిర్వహించిన రోడ్డు షోలో కేసీఆర్ ప్రసంగం – ముఖ్యాంశాలు :

  • మొత్తం మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి.
  • పిచ్చిగా ఉన్మాదం తో కాకుండా ఏపార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీ మనకోసం పనిచేస్తదో ఆలోచించి ఓటేయాలి
  • బీజేపీ మేకిన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఒక్కటి అమలు చేస్తాలేదు.
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మీద దాడులు
  • డాలరు విలువ 83 రూపాయలకు పెరిగింది
  • ఒకపార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతంది.. ఇంకో పార్టీ దేవుని మీద ఒట్లు .. ఇదీ నడుస్తాంది
  • మనం అద్భుతంగా యాదాద్రిని నిర్మించుకున్నం కానీ ఎన్నడూ ఓట్లకోసం వాడుకోలే
  • భోనగిరిలో బిజెపి కాంగ్రెస్ మిలకత్ అయినయి
  • అక్షింతలు తీర్థాలు మన పిలగాన్ల కడుపునింపుతదా .?
  • తలకాయ తెగిపడ్డా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన మోడీ కి
  • కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే
  • ఇవ్వాళ ఎంపీ గా పోటీ చేసేటాయిన అయ్యల ఎంత అడిగిన ఇయ్యాలే
  • తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ
  • ఇప్పుడు యువత ఆలోచించాలి భవిష్యత్తు మీదే
  • మన శత్రువే కాంగ్రెస్ పార్టీ
  • నాడు ఎవ్వడు లేకున్నా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుని పదేండ్లు నడిపినాం
  • తల్లికొడివలే అందరినీ కాపాడుకున్నాం
  • మొదటి సంవత్సరం లోనే చెడిపోయిన కరెంటును బాగుచేసుకున్నాం రైతుబంధు ఇచ్చుకున్నాం
  • బసవపురం రిజర్వాయర్ కట్టుకున్నం
  • ఐదేకురాలకు ఇస్తామంటే ఆరో ఏకురం వాడు ఎటుపోవాలి
  • పొలాలను ఎండబెట్టిండ్రు
  • బోర్లు ఎండినాయి పూడికలు తీసే క్రేన్లు మల్లోచ్చినాయి
  • ధాన్యం కొంటలేరు
  • రాత్రిపూట మోటర్ పెట్టి పాము కాట్లకు సచ్చే దుర్మార్గపు పాలన కాంగ్రెస్ ది
  • కేసీఆర్ పొంగనే కట్క బంజేసినట్టే నీళ్లు ఆగినాయి కరెంటు ఆగింది
  • దద్దమ్మనప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు
  • రైతులు చనిపోతే ఒక్క మంత్రి పోలె సీఎం పోలె
  • నా కండ్లముందాలనే పంట ఎండిపోతే ఎంజేయాల్నే నోరుమూసుకుని ఊకోవాల్నా కొట్లాడాల్నా.?
  • ఫీజు రీబర్సంట్ ఇస్తాళేరు
  • చేనేత కార్మికులను ఆదుకుంటాలేరు
  • నిరుద్యోగ బృతి లేదు బోగస్
  • ఐదొందలు బోనస్ అన్నరు ఇప్పుడు లేదు అంటున్రు
  • రెండు లక్షలు రుణ్మాఫీ అన్నారు ఇచ్చిండ్రా
  • తులం బంగారం తుస్సుమన్నది బోనస్ బోగస్ అయింది
  • గృహకు జ్యోతి విద్యుత్తు పరిస్థితి అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు అయింది
  • స్కూటీ రాలేదు కానీ లూటీ అయితాది
  • తెలంగాణ కు కాంగ్రెస్ కు పంచాతి పడ్డది మీరు ఎవలిని కోరుకుంటారు పంచ్ గా…
  • కేసీఆర్ కేసీఆర్ ప్రజల స్పందన
  • నన్ను తెలంగాణ కోసం పుట్టించిండ్రు దేవుడు
  • ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్… కేసీఆర్ గుండె చీలిస్తే కనపడితే కనిపించేది తెలంగాణ ప్రజలు
  • దేర్ హోగా మగర్ అందేర్ నహీ
  • మనది సెక్యులర్ పార్టీ
  • నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిండ్రు.. ప్రాణం పోయేదాకా న్యాయం కోసం కొట్లాడుతాం
  • బిఆర్ఎస్ కార్ గుర్తుమీద ఓటేసి క్యామ మల్లేష్ గారిని గెలిపించండి
  • ఆయన 24 గంటలు మీ సేవలో వుంటాడు తలలో నాలుక లాగా ఉంటాడు
  • ఇదే ఉత్సాహం మే 13 దాకా చూయించి బీఆర్ ఎస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News