Thursday, January 22, 2026
HomeతెలంగాణThimmapur: కాంగ్రెస్ లోకి టైగర్ శీనన్న

Thimmapur: కాంగ్రెస్ లోకి టైగర్ శీనన్న

పొన్నం, కవ్వంపల్లి ఆధ్వర్యంలో..

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.

- Advertisement -

ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ తీశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి సమక్షంలో తుమ్మనపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ లో చేరగా వారు కండువా వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఎంపీ అభ్యర్థికి నాగలి బహూకరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News