Saturday, July 27, 2024
Homeపాలిటిక్స్KCR Tour: కేసీఆర్ టూర్ గ్రాండ్ సక్సెస్

KCR Tour: కేసీఆర్ టూర్ గ్రాండ్ సక్సెస్

రైతుల గోస విన్న ..

నీళ్లు అందక ఎండిపోయిన పంట పొలాలను బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని ధరావత్ తండాలో పంట ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన పలువు రైతులను కేసీఆర్ పరామర్శించారు. దుఃఖంలో ఉన్న రైతులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

- Advertisement -

ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపారు. ఆదివారం ఉదయం క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలు దేరిన బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్ నేరుగా జనగామ జిల్లా ధరావత్ తండాకు చేరుకున్నారు.

ఎర్రవెల్లి నివాసం నుండి బయలుదేరిన అధినేతకు అడుగడుగునా జన నీరాజనాలు పలికారు. తమ అభిమాన నాయకునికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ సందర్భంగా నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంటను కోల్పోయిన ఆంగోతు సత్తెమ్మ కేసీఆర్ ముందు తన గోడువెల్ల బోసుకుంది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని కేసీఆర్ ముందు విలపించారు. తన కొడుకు పెళ్లి పెట్టుకున్నానని పంట ఎండిపోవడంతో చేతిలో చెల్లి గవ్వలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవడంతో తక్షణమే స్పందించిన సత్యమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలను కేసీఆర్ అక్కడికక్కడే ప్రకటించారు.
రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును సాధించుకుందామని.. రైతు రుణమాఫీని రైతు బంధు పోరాడి సాధించుకుందామని భరోసా ఇచ్చారు.

ధరావత్ తండాకు చెందిన నరసింహ నాయక్, సత్తెమ్మ చెందిన ఎండిన పంట పొలాలను కేసీఆర్ సందర్శించి వారితో పాటు అక్కడకు చేరుకున్న తండాకు చెందిన రైతులతో ఎండిన పంట పొలంలనే నిలబడి మాట్లాడారు. వారి కష్టాలను సాధకబాధకాలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా రైతులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన పంటను కేసీఆర్ చేతికందించి గుండె పగిలేలా రైతులు రోదించారు..

“ ధైర్యం కోల్పోవద్దు. పోరాటం చేద్దాం ధైర్యంగా వుండండి” అంటూ వారికి కేసీఆర్ ధైర్యాన్నిచ్చారు. ఈ సందర్భంగా ధరావత్ తండాకు చెందిన ధన్సింగ్ మాట్లాడుతూ…

“మీ హయాంలో పదేండ్ల కాలం బంగారమొలిగే బతికినం. మా జీవితాలు ఇట్లయితాయని ఎన్నడూ అనుకోలే. మీరు ముఖ్యమంత్రిగా వున్న సక్కదనాల కాలాన్ని చేతులారా కాల్లదన్నుకున్నట్టయింది. ఎప్పటోలే కాల్వనీల్లొస్తాయని ఆశపడ్డం కాంగ్రెస్ పార్టీ వొచ్చి కరువు తెచ్చె…ఏమి చేయాలే ఎట్లా
బతుకాలే. మీరున్నప్పుడు ఉన్నోడికే కాదు పేదోడికి పండింది కూడా పంట .ఇప్పుడిట్ల ఎండిపోయింది..” అని కేసీఆర్ ను పట్టుకొని విలపించారు.

అక్కడనుండి సూర్యాపేటకు వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News