Thursday, January 23, 2025
HomeఆటKarimnagar: జాతీయ స్థాయి పోటీల్లో మన కుర్రాళ్లు

Karimnagar: జాతీయ స్థాయి పోటీల్లో మన కుర్రాళ్లు

సాయి, రాజు, జితేందర్ నేషనల్స్ కు..

ఫిబ్రవరి17 నుండి 19 వరకు కరీంనగర్ జిల్లా లో జరిగిన తెలంగాణ రాష్ట్ర హ్యాండ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 52వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్ & ఉమెన్స్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ 2023-24 లో కరీంనగర్ జట్టు తృతీయ స్థానం పొంది జాతీయ స్థాయి పోటీలకు తెలంగాణ జట్టు తరుపున ఏ. సాయి కృష్ణ జె . రాజు టీ . జితేందర్ ముగ్గురు క్రీడాకారులు అత్యంత ప్రతిభ కనబరిచి మార్చి 31 నుండి ఏప్రిల్ 04 వరకు బీహార్ లోని బావురని లో జరిగే (ఎచ్ ఎఫ్ ఐ )జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయినట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వర రావు, బాసర వేణి లక్ష్మణ్ తెలిపారు.

- Advertisement -

ఈ ఎంపిక పట్ల డి వై ఎస్ ఓ శ్రీకాంత్ రెడ్డి ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జనార్ధన్, వైస్ ప్రెసిడెంట్ కాసర్ల ఆనంద్ కుమార్, రమణ రావు, ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి ఎన్ .ప్రభాకర్, కోచ్ మూల వెంకటేష్, ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ సంఘ బాధ్యులు పెద్దపల్లి కన్వీనర్ సురేందర్ సిరిసిల్ల జె . కృష్ణహరి,జగిత్యాల కన్వినర్ పెద్దబోయిన శ్రీనివాస్, ప్రేమ్, విద్యాసాగర్ సీనియర్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News