Tuesday, July 15, 2025
Homeపాలిటిక్స్Kodali Nani : నేడు ఏఐజి నుంచి డిశ్చార్జ్ కానున్న కొడాలి నాని

Kodali Nani : నేడు ఏఐజి నుంచి డిశ్చార్జ్ కానున్న కొడాలి నాని

నేడు ఏఐజి నుంచి కొడాలి నాని (Kodali Nani) డిశ్చార్జ్ కానున్నారు. కొడాలి నానికి నిర్వహించిన హెల్త్ టెస్టుల్లో గుండె కవాటాల్లో క్లాట్లు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. క్లాట్లకు సంబంధించి అంత అత్యవసరంగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు వైద్యులు.

- Advertisement -

స్టంట్ లు వేయడమా, బైపాస్ సర్జరీ చేయడమా అనేదానికి సంబంధించి కొడాలి నాని ఇంకా నిర్ణయించుకోలేదని తెలిపారు. సెకండ్ ఒపీనియన్ కోసం ఇతర హాస్పిటల్స్ సంప్రదించే అవకాశం ఉందన్నారు. సెకండ్ ఒపీనియన్ తరువాత ఉగాది తరువాత పూర్తిస్థాయి చికిత్స చేయించుకోనున్నారు కొడాలి నాని.

బుధవారం ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని(Kodali Nani) అస్వస్థతకు గురికాగ ఆయనను నగరంలోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చేర్పించారు. గ్యాస్ట్రిక్ సమస్యలతో చేరిన నానికి అక్కడ సిబ్బంది పలు వైద్య పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News