Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Madhira: తండ్రి గెలుపు కోసం తనయుడి పోరాటం

Madhira: తండ్రి గెలుపు కోసం తనయుడి పోరాటం

మీ సంక్షేమానికి చిరునామా మా నాన్నంటూ దూసుకుపోతున్న..

మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య తండ్రి గెలుపు కోసం అహర్నిశలు నియోజకవర్గంలోని గ్రామ గ్రామం, వాడ వాడ తిరుగుతూ తండ్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో మరింత అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క గత 15 సంవత్సరాలుగా మధిర ప్రజలకు సుపరిచితుడని అసెంబ్లీలో ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను నిలదీసేందుకు నడుంబిగించారని రాష్ట్రం మొత్తం తెలిసిన వ్యక్తి అని రాత్రి పగలు నియోజకవర్గ ప్రజలకు కొరకు పరితపించే వ్యక్తి అని తన తండ్రికి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మీరే తీసుకోవాలని ప్రచారం నిర్వహిస్తున్న సూర్య విక్రమాదిత్య మల్లు. తన తండ్రి నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారని నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కష్టపడి మధిర అభివృద్ధి పథంలో ఉండేలా చేశారని తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలకు ఇచ్చే గ్యాలరీలను ఈ విధంగా వివరించారు.

- Advertisement -


ఇల్లు లేని వారికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం, రూ 500 కే వంట గ్యాస్,మహాలక్ష్మి పథకంతో ప్రతి మహిళకు నెలకి 2500, గృహ జ్యోతి పతకం ద్వారా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్, రైతు భరోసా ద్వారా ప్రతి ఏటా 15 వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు, చేయూత పథకం ద్వారా 4000 పింఛన్, రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా ద్వారా పది లక్షలు లని వివరిస్తూ ఈ పథకాలన్నీ ప్రజలందరికీ రావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News