Sunday, June 30, 2024
Homeపాలిటిక్స్Mallapur: నీచ రాజకీయాలు నాకు రావు, పార్టీలు మారే సంస్కృతి నాది కాదు

Mallapur: నీచ రాజకీయాలు నాకు రావు, పార్టీలు మారే సంస్కృతి నాది కాదు

ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో నీచ రాజకీయాలు ఎక్కువయ్యాయని, ఎవరి స్వార్థం కోసం వారు రాజకీయాలు చేస్తున్నారనీ, ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేవని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. మల్లాపూర్ మండల ఎంపిటిసిల ఆత్మీయ సమ్మేళనంలో ఎంఎల్ఏ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు రాజకీయాల్లో ప్రతీ ఒక్కరు ఉన్నత స్థానంలో ఉండాలని, ఎంపిటిసిలు ఐదేళ్లలో చేసిన సేవలు అమోఘం అని, రాబోయే రోజులలో మంచి పనులు చేసి ప్రజలకూ సేవలు అందించాలని కోరారు.

- Advertisement -

నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఎంపిటిసిలకు న్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రజా జీవితం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, పార్టీలు మారే వ్యక్తిత్వం తనకి లేదని, ప్రస్తుతం నీచ రాజకీయాలు ఎక్కువయ్యాయని, తాను ఏ పార్టీకి వెళ్లను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు తమ ఐదేళ్ల కాలంలో చేసిన సేవలు, అన్యోన్యంగా ఉన్న పరిస్థితులని పంచుకున్నారు. ఈ సందర్బంగా ఎంపీపీ కాటిపల్లి. సరోజనా మాట్లాడుతు ఏదేళ్ళల్లో మండల అభివృద్ధికి కృషి చేసినా ప్రతీ ఒక్కరికీ, కష్టకాలంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News