Sunday, December 8, 2024
Homeపాలిటిక్స్Mallapur: పల్లెల్లో కానరాని ఎన్నికల హడావిడి

Mallapur: పల్లెల్లో కానరాని ఎన్నికల హడావిడి

పట్టణ, మండల కేంద్రాలలోనే ప్రచారం

లోకసభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఇప్పటి వరకు పల్లెల్లో ఎన్నికల హడావిడి కనిపించడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, స్థానికంగా ఉన్న నాయకులు ఎవరూ కూడా ప్రచారం పట్ల అంతగా ఆసక్తి చూపినట్టు కనబడటం లేదు. నిజాంబాద్ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటి వరకు పల్లెల్లో ప్రచారం చేసిన దాఖలాలు లేవు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారాలు, సభలు నిర్వహించడం లేదు. ఎంపీ అభ్యర్థులుగా అధికార కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, బిజెపి నుంచి ధర్మపురి అరవింద్, టిఆర్ఎస్ పార్టీ నుండి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. నియోజకవర్గం ప్రచారంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎవరు ప్రచారంలో దూసుకెళ్లడం లేదు. పట్టణ, మండల కేంద్రాల్లో సమీక్షా సమావేశాలు, ముఖ్య కార్యకర్తల సమావేశలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికీ ప్రచారం ప్రారంభం కాకపోవడం, గ్రామాల్లో ఎన్నికల వేడి ఉండకపోవడంతో ఎన్నికలు జరుగుతున్నాయా, లేవా అన్నట్టు ప్రశాంత వాతావరణం ఉంది. ఇక ఉన్న ఈ కొద్ది రోజుల్లోనైనా నేతలు గ్రామాల్లో ప్రచారం చేస్తారో లేదో చూడాలిమరి.

- Advertisement -

వెరసి ఇటు అన్ని పార్టీ శ్రేణుల్లో, గ్రామ స్థాయి నాయకుల్లో పెద్దగా ఎన్నికల పట్ల ఆసక్తి కనిపించటం లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News