Saturday, May 18, 2024
Homeపాలిటిక్స్Karepalli: బీజేపీ బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే

Karepalli: బీజేపీ బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే

రామసహాయం రఘరాంరెడ్డి విజయం

కేంద్రంలో ప్రభుత్వం ఏలుతున్న నరేంద్ర మోడీ రాష్ట్రంలో పదవి పోయిన కేసీఆర్ ల ఆటలు ఇక సాగవని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘరాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కారేపల్లి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఓట్ల కోసం రాముడిని సైతం రాజకీయలోకి లాగిన టక్కరి మోడి అని అన్నారు. ఖరీదైన డ్రస్సులతో విదేశాల చుట్టూ తిరిగే మోడీ ప్రజల కష్టాలు పక్కనపెట్టి, పబ్బం గడుపుకోవటానికి ప్రజలకు మధ్య చిచ్చులు పెడుతున్నారన్నారు. మోడీ, కేడీ (కేసీఆర్) ఇద్దరు ఒక్కటే అని లక్షా 50 వేల కోట్లు తెలంగాణ సొమ్మును దోచుకున్న కేసీఆర్ దానిని కాపాడు కోవటానికి మోడీ పంచన చేరాడన్నారు. నమ్మిన పార్టీ మోసం చేస్తే కార్యకర్తలు, అభిమానులు కష్టల్లో ఉన్న తనను కర్ర పట్టి కాపాడారని వారి నమ్మకాన్ని వమ్ముచేయనన్నారు. కార్యకర్తలు కష్ట ఫలితంగా ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులమైనామన్నారు. అగష్టు 15 లోపు రుణమాఫి, రేషన్కార్డులు, పింఛన్ ఇస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇస్తామన్నారు. రామ సహాయం రఘరాంరెడ్డిని గెలిపించి రాహుల్ని ప్రధానిని చేద్దామన్నారు.

- Advertisement -

నేను పక్కా లోకల్

నేను లోకల్ కాదని ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారని నేను పక్కా లోకల్ అని మా నాన్నది కుసుమంచి మండలం చేగోమ్మ అని, మా అత్తగారి ఊరు తిరుమలాయపాలం ఉందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నాన్ లోకల్ అని అన్నారు. నన్ను పార్లమెంట్కు పంపండి మంత్రులు క్రింద ఉండి అభివృద్ధి చేస్తానన్నారు.

పోడు, సాగు సమస్యల పరిష్కరించాలి

వైరా నియోజవర్గంలో పోడు సమస్య, సాగునీటి సమస్య తీవ్రంగా ఉందని దానిని పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం అన్నారు. వామపక్షాలు, యూపీఏ పాలనలో ఉపాధీ హామీ, సమాచార హక్కు వంటి చట్టాలు తెచ్చి ప్రజారంజక పాలన సాగిందన్నారు. అదే పాలన రావటానికి మంచి సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి హస్తం గుర్తుకు ఓటు వేసి కేంద్రంలో ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకుందామన్నారు.

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలసాని లక్ష్మినారాయణ, రాంరెడ్డి గోపాలరెడ్డి, బోర్ర రాజశేఖర్, పగడాల మంజుల, తలారి చంద్రప్రకాష్, ఇమ్మడి తిరుపతిరావు, బానోత్ విజయబాయి, సీపీఎం నాయకులు కొండెబోయిన నాగేశ్వరరావు, కె.నరేంద్ర, సీపీఐ నాయకులు బోళ్లరామస్వామి, టీడీపీ నాయకులు మండెపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్లో చేరిన ఎంపీటీసీలు

కారేపల్లి మండలానికి చెందిన మాణిక్యారం, ఉసిరికాయలపల్లి ఎంపీటీసీలు శివరాత్రి పార్వతి అచ్చయ్య, మూడ్ జ్యోతి మోహన్ లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాన్నాయక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

పొంగులేటికి బ్రహ్మరధం పట్టిన జనం

కారేపల్లి మండల పర్యటనకు వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డికి జనం బ్రహ్మరధం పట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు సీపీఎం, సీపీఐ, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News