Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Mallapur: డిసెంబర్ లోగా చక్కర కర్మాగారం పునః ప్రారంభం

Mallapur: డిసెంబర్ లోగా చక్కర కర్మాగారం పునః ప్రారంభం

రైతు బిడ్డకు ఛాన్స్ ఇవ్వాల్సిందే

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతామని, డిసెంబర్ నాటికి చక్కెర కర్మకారుల పునరుద్ధరణ చేపడతామని, ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తామని, ఇచ్చిన 6 గ్యారంటీలో అది గ్యారెంటీలు ఇప్పటికి అమలు చేస్తున్నామని సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -

మల్లాపూర్ మండల కేంద్రంలోని కనక మేశ్వర ఫంక్షన్ హాల్ లో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగా రావు, టీపీసీసీ డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావులు పాల్గొన్నారు.

ఈ సమావేశం సందర్భంగా టిపిసిసి డెలిగేట్ సభ్యులు కల్వకుంట్ల సుజిత్ రావు మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల్లో రైతు బిడ్డకు ఒకసారి అవకాశం ఇవ్వాలని, గతంలో మంత్రివర్గంలో ఉన్నప్పుడు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి మర్చిపోరాదని, చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం జీవన్ రెడ్డి చేసిన కృషి అమోఘమని ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి జీవన్ రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడాలని కార్యకర్తలను కోరారు.

అరవింద్ ది అంతా తప్పుడు ప్రచారమే..

కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాకు జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులు అనేకం అని, బిజెపి ఎంపీ అభ్యర్థి అరవింద్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో అరవింద్ కు ఓటమి తప్పదని, కార్యకర్తలు ఇంకా కష్టపడి జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

కవితకు పట్టిన గతే అరవింద్ కు..

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఎంపీగా అవకాశం ఇచ్చిందని, రైతు బిడ్డనైన తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, రైతులు సబ్బండ వర్గాల ఎల్లవేళలా కృషి చేస్తానని, గతంలో కవితకు పట్టిన గతే అరవింద్ కు పడుతుందని హెచ్చరించారు. అరవింద్ మతితప్పి, అహంకారంతో మాట్లాడుతున్నాడని, 5 ఏళ్లలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటో అరవింద్ చెప్పాలని, కొద్ది రోజుల్లో అరవింద్ కనుమరుగు అవుతారని అన్నారు.

గెలిచినా, ఓడినా మీతోనే..

గల్ఫ్ కార్మికుల అభ్యున్నతి కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, అర్హులైన బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తామని అన్నారు. టిఆర్ఎస్ బిజెపిలు ఒక్కటై కాంగ్రెస్ ని ఓడించాలని చూస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని, కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, జగిత్యాల జిల్లా ప్రజలతో తన అనుబంధం చాలా పెద్దదని, గెలిచినా ఓడిన ప్రజల్లోనే ఉంటానని, ప్రతి ఒక్క కార్యకర్త మీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని హామీ ఇచ్చారు. గత పాలకులు నిజామాబాద్ పార్లమెంటు అభివృద్ధిని మరచారని, ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడతానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని జీవన్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలాల.జలపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ముల చిన్నారెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పుండ్ర.శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గున్నాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు నల్ల. బాపు రెడ్డి, లక్ష్మా రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లయ్య, ఆనంద్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు మహిపాల్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు పోతు శేఖర్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఎడ్ల నవీన్, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News