Monday, May 20, 2024
Homeపాలిటిక్స్Manakonduru: బిజెపి అట్టర్ ఫ్లాప్ పార్టీ

Manakonduru: బిజెపి అట్టర్ ఫ్లాప్ పార్టీ

మంత్రి పొన్నం

గాంధీలది త్యాగాల కుటుంబమని, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇద్దరు ప్రజల కోసం ప్రాణాలర్పించారని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ..కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకురావాలని సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బండి సంజయ్ ఏనాడు గ్రామాల్లోకి రాలేదన్నారు.
గడిచిన ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చిందన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్పండి అని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలు గ్రామాల్లో ధైర్యంగా తలెత్తుకు తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటు అడగండి అని పిలుపునిచ్చారు. రాముడు పేరుతో రాజకీయం చేస్తున్నది మీరు కాదా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మోడల్ స్కూళ్లు, కేంద్రీయ విద్యాలయాలు మేము తెస్తే, మీరేం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరి బూత్ స్థాయిలో వారు మెజార్టీ తెచ్చేందుకు కృషి చేయాలనీ, అలా చేసిన గ్రామాల్లో అభివృద్ధికి తనదే హామీ అని పొన్నం భరోసా ఇచ్చారు. ఎన్నికలప్పుడు ఏ పదవి ఉన్నా నడవదని, కార్యకర్తలు బూత్ స్థాయిలో కష్టపడాలని, కష్టపడ్డ వారికే గుర్తింపు ఉంటుందన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని పొన్నం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాకు ప్రాణ సమానులన్నారు. కార్యకర్తలు దీవిస్తేనే నేను ఈ స్థానంలో ఉన్నానన్నారు. నరేంద్ర మోడీ పాలనలో హామీలు ఇవ్వడమే తప్ప నెరవేర్చింది ఏమీ లేదన్నారు. మోడీ పాలనలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శాంతి లేదన్నారు. మోడీ ఎన్నికల బాండ్ల పేరుతో అవినీతిని ప్రోత్సాహస్తున్నాడని ఆరోపించారు. బిజెపి నేతలు రామరాజ్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో నియంతను బొందపెట్టి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కవ్వంపల్లి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ…కార్యకర్తలు సైనికుల్లా పని చేసి గెలిపించాలని కోరారు. ఎంపి టికెట్ కోసం అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, తీన్మార్ మల్లన్నతో పాటు పలువురు ఆశించినప్పటికీ నాకే ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బిజెపి హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రపతిని సైతం నిలబెట్టి అవమానించారన్నారు. బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తనను ఎంపిగా గెలిపిస్తే మూడేళ్లలో సిద్దిపేట నుండి కరీంనగర్ రైల్వేలైన్ పూర్తి చేస్తానన్నారు. వేములవాడ, చొప్పదండి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు.

సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్, హుజురాబాద్ ఇంచార్జిలు పుర్మమల్ల శ్రీనివాస్, వొడితల ప్రణవ్, ఎంపీపీలు ముద్దసాని సులోచన, లింగాల మల్లారెడ్డి, వెంకటరమణా రెడ్డి, కర్ర సత్యప్రసన్న రెడ్డి, మల్యాల సుజిత్ కుమార్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, ఎస్.ఎల్ గౌడ్, ఒగ్గు దామోదర్, పాశం రాజేందర్ రెడ్డి, పసుల వెంకటి, పులి కృష్ణ,అంతగిరి వినయ్, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు మోరపల్లి రమణా రెడ్డి, నందగిరి రవి, భోంపెల్లి రాఘవ రెడ్డి, ముక్కీస రత్నాకర్ రెడ్డి, ముస్కు ఉపేందర్ రెడ్డి, గోపగోని బసవయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News