Thursday, May 9, 2024
Homeహెల్త్Acidity: ఎసిడిటీకి వంటింటి చిట్కాలు

Acidity: ఎసిడిటీకి వంటింటి చిట్కాలు

కొంచెం కేర్ తీసుకుంటే..

ఈమధ్య కాలంలో యువత, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా చాలామంది ఎసిడిటీ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. దీని నివారణకు మంచి వంటింటి టిప్స్ ఉన్నాయి.
అవేమిటంటే…
 అరటిపళ్లల్లో సహజసిద్ధమైన యాంటాసిడ్ లక్షణం ఉంది. ఇది శరీరరంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. ఎసిడిటీగా ఉంటే ఒక అరటిపండు తినాలి. లేదా అరటిపండుతో చేసిన స్మూదీ తిన్నా వెంటనే ఫలితం కనిపిస్తుంది.
 అల్లంలో యాంటిఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎసిడిటీ అనిపించినపుడు చిన్న అల్లం ముక్కను తీసుకుని దాన్ని చప్పరించవచ్చు. లేదా అల్లం టీ తాగినా కూడా ఎసిడిటీ నుంచి సాంత్వన లభిస్తుంది.
 అలొవిరా జ్యూసు తాగితే ఎసిడిటీ వల్ల తలెత్తే ఉబ్బరం, మంట, ఇరిటేషన్ వంటి బాధలు తగ్గుతాయి. మధ్యాహ్నం అన్నం తినడానికి ఇరవై నిమిషాల ముందర పావు కప్పు అలొవిరా జ్యూసు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
 సోంపుగింజల్లో ఎనథాల్ అనే కాంపౌండ్ ఉంది. ఇది పొట్టలోని అసౌకర్యాన్ని తగ్గించడమే కాదు మంటను నివారిస్తుంది. అందుకే భోజనం అవగానే కొన్ని సోంపు గింజలను నమిలితే మంచిది. లేదా సోంపు గింజలతో చేసిన టీ తాగినా కూడా ఎసిడిటీ బాధ తగ్గుతుంది.
 కొబ్బరినీళ్లల్లో సహజసిద్ధమైన కూలింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి ఎసిడిటీని తగ్గిస్తాయి. అందుకే రోజుకు రెండుసార్లు గ్లాసుడు కొబ్బరి నీళ్లు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.

- Advertisement -

 జీలకర్ర కూడా ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. నిత్యం మీరు తినే కూరల్లో జీలకర్ర గింజలు తప్పకుండా వేసుకోవాలి. లేదా జీలకర్ర టీ తాగితే కూడా ఎసిడిటీ సమస్య నుంచి సాంత్వన పొందుతారు.
 యాపిల్ సిడార్ వెనిగర్ కు ఎసిడిక్ స్వభావం ఉన్నా కడుపులోని పిహెచ్ ను అది సమతుల్యం చేస్తుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. అందుకే ఒక గ్లాసుడు నీటిలో టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్ వేసి బాగా కలిపి అన్నం తినబోయేముందు తాగితే ఎసిడిటీ తగ్గుతుంది.
 బాదంపప్పుల్లో కాల్షియం పుష్కలంగా ఉంది. ఇది పొట్టలోని ఆమ్లాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అందుకే రోజూ రాత్రి కొన్ని బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయం లేచిన వెంటనే తినాలి. ఇలా చేస్తే ఎసిడిటీ తగ్గుతుంది.
 పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరు గుణాలు సమ్రుద్ధిగా ఉన్నాయి. ఇవి కడుపులోని ఎసిడిటీ తీవ్రతను బాగా తగ్గిస్తాయి. అందుకే నిత్యం మీరు తినే ఆహార పదార్థాల్లో చిటికెడు పసుపు కలిపి వండుకుంటే మంచిది. లేదా పసుపుతో టీ చేసుకుని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News