Saturday, November 23, 2024
Homeపాలిటిక్స్Mothe Srilatha Reddy: అత్తగారింటి నుంచి పుట్టింటికొచ్చినట్టుంది

Mothe Srilatha Reddy: అత్తగారింటి నుంచి పుట్టింటికొచ్చినట్టుంది

గ్రేటర్ లో మా ఫ్యామిలీతో టీఆర్ఎస్ మొదలై, బీఆర్ఎస్ మా ఫ్యామిలీతోనే ముగుస్తుంది

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం 2000 సంవత్సరం నుండి బిఆర్ఎస్ పార్టీలో పనిచేసినా, బిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులుగా మాకు సరైన న్యాయం జరగలేదన్నారు జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్, మోతే శ్రీలత అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అత్తగారింటి నుండి తల్లి గారి ఇంటికి వచ్చినంత ఆనందం కలిగింది. ఎవరి ఒత్తిడి లేకుండానే ఇష్టపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆమ అన్నారు.

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారులను మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టి. రాజీనామా చేయించారని .. బిఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర చైర్మన్ మోతే శోభన్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాదని ధనబలం ఉన్నటువంటి వ్యక్తులనే ప్రోత్సహిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మా కుటుంబంలో మా తమ్ముడితో మొదలైందని ఆయన చెప్పుకొచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారుల పట్ల తీసుకున్న నిర్ణయం పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం.. ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడినప్పటికీ ఉద్యమకారులను గుర్తించకపోవడం పట్ల కాంగ్రెస్ వైపు రావడం జరిగింది.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు సైతం రేవంత్ రెడ్డి పెద్దపిట్ట వేయనున్నారు.. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉద్యమకారులకు గౌరవం దక్కుతుందనే ఉద్దేశంతో పార్టీలో చేరాం.. గ్రేటర్ హైదరాబాద్ లో మాతోనే టిఆర్ఎస్ పార్టీ మొదలైంది మాతోటి బి ఆర్ ఎస్ పార్టీ ముగుస్తుందని మోతె శోభన్ జోస్యం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News