Friday, November 22, 2024
Homeపాలిటిక్స్NE Elections: ఈశాన్యంలో మోగిన ఎన్నికల నగారా

NE Elections: ఈశాన్యంలో మోగిన ఎన్నికల నగారా

త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్ లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చ్ 2వ తేదీన వెల్లడించనున్నట్టు ఈసీ తెలిపింది. మేఘాలయలో 60 అసెంబ్లీ స్థానాలుండగా, నాగాలాండ్, త్రిపురలో కూడా 60 చొప్పున అసెంబ్లీ సీట్లున్నాయి.

- Advertisement -

నాగాలాండ్ ప్రభుత్వ పదవీ కాలం మార్చ్ 12న ముగియనుండగా, మేఘాలయాలో మార్చ్ 15న, త్రిపురలో మార్చ్ 22న ప్రభుత్వాల పదవీ కాలం ముగియనుంది. నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానుంది.

ఈ ఏడాది జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే కావటంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. 2018లో త్రిపురలో మొట్టమొదటిసారి బీజేపీ అధికారంలోకి రావటంతో ఇప్పుడు అందరి కళ్లూ త్రిపురపైనే పడ్డాయి. కాగా నాగాలాండ్, నాగాలాండ్ లో నేషనలిస్ట్ డెమాక్రటిక్ ప్రోగ్రెస్సివ్ పార్టీ అధికారంలో ఉండగా, మేఘాలయాలో నేషనల్ ప్యూపుల్స్ పార్టీ అధికారంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలున్నాయి. ఈశాన్యానికి చెందిన నేషనల్ ప్యూపుల్స్ పార్టీ మాత్రమే జాతీయ పార్టీగా గుర్తింపు దక్కించుకుంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలోకి దిగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News