Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Niranjan Reddy: ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రతి కుటుంబానికి పథకం

Niranjan Reddy: ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రతి కుటుంబానికి పథకం

వెయ్యేండ్ల భవిష్యత్ ను కేసీఆర్ కలగన్నారు

ప్రతి ఒక్కరికి సంక్షేమం ప్రతి కుటుంబానికి పథకం అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ అనుమతులు సాధించిన సంధర్భంగా ఏదుల రిజర్వాయర్ లో ఏర్పాటు చేసిన రైతన్నల సంబరాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .. భారీ ఎత్తున హాజరైన రైతులు, ప్రజలు,ఏదుల రిజర్వాయర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు స్థానికులు పాలాభిషేకం చేశారు.

- Advertisement -

సంక్షేమ గురుకుల పాఠశాలలు, తెలంగాణ రావడం ఖాయం .. పాలమూరు రంగారెడ్డితో నీళ్లిస్తాం అని, 2009లోనే కేసీఆర్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. వెయ్యేండ్ల భవిష్యత్ ను కేసీఆర్ కలగన్నారనీ, ఆయన గులాబీ జెండా ఎగరేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనీ అన్నారు. రాష్ట్రం తెచ్చిన కేసీఅర్ కు ప్రజలు అధికారం ఇచ్చారనీ, నేడు దేశంలో ఏ రాష్ట్రం కూడా తెలంగాణ అభివృద్ధితో పోటీ పడలేదన్నారు. ఒకనాడు నీళ్లకు గతిలేని స్థితి .. పశువులకు గడ్డి లేని పరిస్థితి, నేడు తెలంగాణలో పండే పంటలు కొనలేమని కేంద్రం చేతులెత్తేసే పరిస్థితి ఉందని, అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు.

కొత్తగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2015 జులై 11న శ్రీకారం చుట్టారనీ,ఈ పథకానికి రూపశిల్పి కేసీఆర్ అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 10 లక్షవ ఎకరాలు, రంగారెడ్డి, నల్గొండల్లో 2.50 లక్షల ఎకరాలకు నీళ్లు,ప్రాజెక్టు కట్టకుండా అనేక రకాల కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. 5 లక్షల చొప్పున రైతులకు ఇచ్చి వారి సహకారాలతో ప్రాజెక్టు పనులు తుది దశకు తీసుకువచ్చాం అని, నీళ్ల కేటాయింపు లేదని కేంద్రం, అంధ్రా ప్రభుత్వాలు అడ్జుపుల్లలు వేశాయని, కృష్ణా నీటి వాటా తేల్చకుండా కేంద్రం 9 ఏొళ్లుగా నాన్చుతున్నదనీ మండిపడ్డారు. నీటి వాటా తేల్చలేదని కేంద్రానికి ఈ దేశంలో ప్రజలను బాగుచేస్తుంద, నీటి వాటా ఎప్పుడైనా తేల్చుకోండి మేం ప్రాజెక్టు కట్టడం ఖాయం అని కేంద్రానికి స్పష్టం చేశామన్నారు.

కేంద్రం అడ్డంకులు అధిగమించి పర్యావరణ అనుమతులు సాధించామని, ఇదొక చారిత్రక ఘట్టం అని అన్నారు. చరిత్రలో చాలా తక్కువ నమోదయిన సంధర్భం, ఎవరూ కలగనలేదు .. ఇక్కడ ప్రాజెక్టు వస్తది, లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయి అని, మొత్తం 90 టీఎంసీల నీళ్ల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించుకున్నమనీ, అన్ని నీళ్లు ఒక్కసారి నిలుపుకుంటే భూగర్భ జలాలు ఉబికి వస్తాయి అన్నారు. భవిష్యత్ లో ఒకటి, రెండేళ్లు వానలు రాకున్నా వ్యవసాయానికి ఢోకా ఉండదని, నీళ్లిచ్చిన కేసీఆర్ కు పాలాభిషేకంతో అభినందించారనీ అన్నారు.


ప్రజల కోసం, రైతుల కోసం పనిచేయ చేతగాని నాయకులు ఎన్నికలు దగ్గరకు రాగానే ఊర్ల మీద పడ్డారని, 60 ఏళ్లు గత పాలకులు, నాయకులు పాలమూరును ఎడారి చేస్తే కేసీఆర్ పచ్చదనంతో నింపారని అన్నారు. నీళ్లు, కరంటు, విద్య, వైద్యం అన్ని రంగాలలో కేసీఆర్ అభివృద్ధి చేశారని, మీ వద్దకు వచ్చే నాయకులతో కేసీఆర్ చేసినవి చెప్పి వాళ్లం చేస్తారో అడగండి అన్నారు.

లోకమున్నంత వరకు వ్యవసాయం ఉంటుంది .. అందుకే కేసీఆర్ వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చి రైతులకు అండగా నిలుస్తున్నారనీ, అండగా నిలిచిన కేసీఆర్ కి మీరందరూ ఆశీర్వదించాలనీ అన్నారు.
పెద్దమందడి, ఖిల్లాఘణపూర్ మండలాల నుండి బీఆర్ఎస్ లో చేరిన 250 మంది, వనపర్తి నుండి ఏదుల రిజర్వాయర్ వరకు 300 బైకులతో యువకుల భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News