Friday, September 20, 2024
Homeపాలిటిక్స్Padi Kaushik Reddy: హుజురాబాద్ లో గులాబీ జోష్

Padi Kaushik Reddy: హుజురాబాద్ లో గులాబీ జోష్

బలం చాటుకుంటున్న గులాబీ సైన్యం

హుజురాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్థిగా సిఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా మండలి విప్, ఎమ్మెల్సీ, యువనేత పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కు రానున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డికి భారీ స్వాగతం పలకడంతో పాటు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి ర్యాలీ నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సమాయత్తమయ్యాయి. డిపో క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ కూడలి వరకు పెద్ద ఎత్తున జనంతో, పార్టీ శ్రేణులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలి వద్ద రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగే ర్యాలీకి, రోడ్ షో కు బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హాజరుకానున్నారు. కౌశిక్ రెడ్డి రాక సందర్భంగా హుజురాబాద్ గులాబీ మయమైంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుండి, అలాగే పట్టణం నుండి పెద్ద ఎత్తున సమీకరణ చేసి కౌశిక్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ర్యాలీ, రోడ్ షో విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, ఆట, పాటలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసారు. పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేసారు.

- Advertisement -

సత్తా చాటేందుకు సిద్దమైన గులాబీ శ్రేణులు

హుజురాబాద్ అభ్యర్థిగా యువనేత కౌశిక్ ను బీ ఆర్ ఎస్ అధినేత, సిఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. నిజానికి ఫిబ్రవరి 1 న బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటించి కౌశిక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి ఈ సారి బీఆర్ ఎస్ ను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీతో పాటు మండలి విప్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కౌశిక్ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటున్నారు. అలాగే పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఈ సారి హుజురాబాద్ పై గులాబీ జెండా ఎగరేసి తమ సత్తా చాటాలని గులాబీ శ్రేణులు ఉవ్విల్లూరుతున్నాయి. ఏది ఏమైనా హుజురాబాద్ టికెట్ ప్రకటించిన తర్వాత మొదటిసారి యువనేత, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, అలాగే మంత్రి గంగుల కమలాకర్, బోయినపల్లి వినోద్ కుమార్ వస్తున్న సందర్భంగా గులాబీ శ్రేణుల్లో పండగ వాతారవరణం నెలకొంది. ఇదే ఉత్సాహంతో ఎన్నికల ప్రచారం ప్రారంభించి హుజురాబాద్ ను కైవసం చేసుకోవాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News