నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో పోస్టల్ బ్యాలెట్ లలో ధన ప్రవాహం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ఉద్యోగుల ఓట్లను సంతలో పశువుల కంటే హీనంగా రెండు వేల రూపాయలు కొనుగోలు చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు బహిరంగంగా డబ్బులు పంపిణీ చేస్తున్నా, అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
పోలింగ్ జరిగే ప్రదేశంలో 144 సెక్షన్ అమలులో ఉందని గుంపులు గుంపులుగా ఉన్న రాజకీయ నాయకులను దూరంగా వెళ్లిపోండి అని పోలీస్ అధికారులు చెబితే, పోలీసులను సైతం అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు దురుసుగా ప్రవర్తిస్తూ, బెదిరింపులకు గురి చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లోనే ఈ విధంగా ఉంటే, ఈ నెల13న జరిగే పోలింగ్ రోజు ఏ విధంగా ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదని మేధావులు అంటున్నారు.