Monday, May 20, 2024
HomeతెలంగాణChegunta: జగ్గారెడ్డి రోడ్ షో

Chegunta: జగ్గారెడ్డి రోడ్ షో

నీలం మధు కోసం..

దుబ్బాక పట్టణంలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పిలుపు మేరకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హబ్సిపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన రోడ్ షో తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొనసాగింది. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News