Monday, November 17, 2025
Homeపాలిటిక్స్Posani: పోసాని కృష్ణ మురళికి బెయిల్.. పోలీసుల పిటిషన్ డిస్మిస్

Posani: పోసాని కృష్ణ మురళికి బెయిల్.. పోలీసుల పిటిషన్ డిస్మిస్

సినీ నటుడు పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) కాస్త ఉపశమనం లభించింది. పోసాని కృష్ణ మురళికి బెయిల్ లభించింది. అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసాని కృష్ణ మురళికి కడప మొబైల్ కోర్టు బెయిల్ ఇచ్చింది.

- Advertisement -

అలాగే పోసాని కృష్ణ మురళిని కస్డడీకి ఇవ్వాలంటూ ఓబులవారిపల్లె పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటీషన్‌ను కడప మొబైల్ కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు విభేదాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించారంటూ జనసేన నేత జోగినేని మణి చేసిన ఫిర్యాదు మేరకు.. ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పోసాని కృష్ణ మురళిని ఫిబ్రవరి నెలాఖర్లో ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరచగా.. కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad