Sunday, December 8, 2024
Homeపాలిటిక్స్Qutubullapur: రంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపా?

Qutubullapur: రంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంపా?

ఆ ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ లోకేనా?

రంగారెడ్డి జిల్లా ఇంచార్జి, ఐ.టి.శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని సచివాలయంలో రంగారెడ్డి జిల్లా బిఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం కలిశారు. మంత్రితో భేటీ నిజంగా నియోజక వర్గంలో నీ సమస్యల కోసమేనా? లేక పార్టీ మారడం కోసమేనా? అనే ఊహగానాలు ఊపందుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని నలుగురు ఎమ్యేల్యే లు బిఆర్ఎస్ పార్టీ నీ వీడుతారని ప్రచారం ఉపందుకున్నావేళ, ఈ భేటీ పలు అనుమానాలకు దారితీస్తుందని నియోజకవర్గంలోన ప్రజలు అంటున్నారు. ఊహాగానాలు ఎలాగోలా ఉన్నప్పటికీ తమ నియోజక వర్గంలోని సమస్యల దృష్ట్యా ఈ భేటీ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, కూకట్ పల్లి నియోజకర్గంలోని చెరువులు, కుంటల్లో పెరిగిపోయిన గుర్రపు డెక్క తొలగించాలని, దోమల నివారించాలని, నియోజకర్గంలోని అన్ని డివిజన్ లలో ఎలక్ట్రికల్ పోల్స్, వీధి దీపాలు ఏర్పాటు చేయాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్ సర్కిళ్ళ పరిధిలో నెలకొన్న శానిటేషన్ సమస్యలు పరిష్కరించాలని, అలాగే కూకట్ పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలనీ కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి రాజకీయాలకు అతీతంగా పనులు చేస్తామన్నారు. తప్పకుండా మీ సమస్యలను తీరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎంఎల్ఏ, బండారు లక్ష్మా రెడ్డి, ఎల్.బి.నగర్ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి,
శేరిలింగపల్లి ఎంఎల్ఏ అరికెపూడి గాంధీ, మల్కాజిగిరి ఎంఎల్ఏ మర్రి రాజశేఖర్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద పాల్గున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News