Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Shadnagar: ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి బి ఫామ్ అందజేసిన కెసీఆర్

Shadnagar: ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డికి బి ఫామ్ అందజేసిన కెసీఆర్

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో..

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ బీఫామ్ అందజేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డికి బీఫామ్ అందజేసి అభినందనలు తెలిపారు. మహబూబ్ నగర్ గడ్డపై బీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షించారు. అధికార పార్టీతో గట్టిగా కొట్లాడి ప్రజల ఆశీర్వాదంతో ముందుకు కొనసాగి మహబూబ్ నగర్ గడ్డపై ఘన విజయం సాధించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సూచనలు చేశారని నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నవీన్ కుమార్ రెడ్డి అభినందనలు

మహబూబ్ గర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తమ పేరును ఖరారు చేసి బి ఫామ్ అందజేసిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు అభినందనలు తెలియజేశారు. పార్టీ తమపై నమ్మకం పెట్టుకుని టికెట్టు ఇచ్చినందుకుగాను ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయాన్ని సాధించే దిశగా అందరితో కలిసిమెలిసి ముందుకు కొనసాగుతానని అందరి సూచనలు తీసుకుని పార్టీ ఘన విజయానికి నిరంతరం కృషి చేస్తానని మాజీ సీఎం కెసీఆర్ కు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News