సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలపై బిఅర్ ఎస్ పార్టీ భూపాలపల్లిలో మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్ లు. పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, జెడ్పీ చైర్మన్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, సింగరేణి కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సింగరేణి కోసం రాష్ట్ర ప్రజలంతా కలిసి కొట్లాడాలని ఈసందర్భంగా ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని అనడానికి బీజేపీ కి, ప్రధాన మంత్రికి సిగ్గుందా? అన్ని ఆయన, పార్లమెంట్ లో అన్ని బిల్లులకు సహకరించ లేదా? అని నిలదీశారు. రైతులకు, తెలంగాణ ను అన్యాయం చేస్తున్నారు కాబట్టే, మేము మిమ్మల్ని విధాన పరంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతులను ముంచి అదానికి అంబానీకి దోచి పెడితే, నీకు సపోర్ట్ చేయాలా? అంటూ ప్రశ్నించారు.
నీకు కుటుంబం ఉంటే తెలిసేదాని, నీకు భార్య, పిల్లలు ఉంటే తెలిసేదాని ఎర్రబెల్లి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదంటున్న మోడీ తెలంగాణకు ఏం చేశారు? తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఏమయ్యాయి? తెలంగాణకు అన్యాయం చేస్తున్న నీకు ఎలా సహకరించాలి? మా డబ్బులు తీసుకెళ్లి గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్న నీకు మేం సహకరించాలా? నాలుగు వందలు ఉన్న గ్యాస్ పన్నెండు వందలు చేసినందుకు నీకు సహకరించాలా? అంటూ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి నిప్పులు చెరిగారు.