ఇచ్చిన మాట నిలుపుకున్నాం మళ్లీ ఆశీర్వదించండి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభ కు సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సభ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వనపర్తిని జిల్లా చేశాం .. పెబ్బేరులో మత్స్య కళాశాల ఏర్పాటు చేశామన్నారు.2018లో ఎన్నికలలో ఇచ్చిన మాటప్రకారం ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలతో పాటు అదనంగా నర్సింగ్ , వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని,సమీకృత మార్కెట్, టౌన్ హాల్, వ్యవసాయ మార్కెట్, గోదాంలు, మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్నామన్నారు.
వనపర్తి రహదారుల విస్తరణ పూర్తి చేశాం .. ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్ నిర్మించుకోబోతున్నమనీ, 15 చెక్ డ్యాంలు పూర్తి చేసి, మరో 20 చెక్ డ్యాంలకు ప్రతిపాదనలు పంపమన్నారు. నియోజకవర్గంలో లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నమనీ,ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో చెప్పినవి, చెప్పని పనులు చేశామని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ సభ్యులు తిరుమల మహేష్ , జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ , కౌన్సిలర్ నాగన్న యాదవ్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.