Monday, May 20, 2024
Homeపాలిటిక్స్Srikanthachari mother Sankaramma joins Cong:

Srikanthachari mother Sankaramma joins Cong:

ఉత్తమ్ మీద పోటీచేసిన గతంలో పోటీ చేసిన శంకరమ్మ

కాంగ్రెస్ లో జాయిన్ అయిన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ, నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అయ్యారు.

- Advertisement -

ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..శ్రీకాంత చారి అనే యువకుడు తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడని, ఆయన తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పని చేశారన్నారు. ఎఐసిసి ఆదేశాల మేరకు వేరే పార్టీల వారిని కాంగ్రెస్ లో కి ఆహ్వానిస్తున్నామని, శంకరమ్మ నా మీద పోటీ చేశారు అయినా మేము ఎప్పుడు వ్యక్తిగత వైరాలకు వెళ్ళలేదని ఆయన వివరించారు.

హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖాళీ అయ్యిందని, బీజేపీలు జనాలను మోసం చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణకు బీజేపీ చేసింది ఏమి లేదని, మోడీ తెలంగాణకు ఏమి చేసారో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News