సైకో జగన్ పాలన లో దేవుడి మన్యాం భూములకు కూడా రక్షణ కరువైందని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆత్మకూరు మండలం అమలాపురం – కృష్ణాపురం గ్రామాల పోలి మెరల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్రమించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలతో కలిసి పరిశీలించారు.
కృష్ణాపురం, అమలాపురం గ్రామాల వైసిపి నాయకులు దేవుని మాన్యం భూములు ఆక్రమించుకొని కంచెలు వేసుకున్న, అమ్ముకున్న అధికారులకు పట్టడం లేదని.. గ్రామ ప్రయోజనాల కోసం యువత ముందుకు వచ్చి క్రికెట్ గ్రౌండ్ సిద్దం చేసుకుంటే వారి పై ఆక్రమణ కేసులు పెట్టి, దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ జవాన్లు అని కూడా చూడకుండా కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. శ్రీశైలం నియోజకవర్గం లో ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పని అయిపోయింది అని, రానున్న తెలుగుదేశం ప్రభుత్వం లో క్రీడాభివృద్ధికి ఇదే స్థలాన్ని గ్రౌండ్ కు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలేదిలేదని, అక్రమాలకు పాల్పడే అధికారులను సైతం విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Srisailam: జగన్ పాలనలో దేవుడి భూములకు రక్షణ కరువు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES