Tuesday, September 17, 2024
Homeపాలిటిక్స్Tandur: ఇక్కడ బీజేపీ టికెట్ కు ఫుల్ డిమాండ్

Tandur: ఇక్కడ బీజేపీ టికెట్ కు ఫుల్ డిమాండ్

ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 13కు పైన దరఖాస్తులు

వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థుల తాపత్రయం అంతా ఇంతా కాదు. రాబోయే ఎన్నికల్లో తాండూరు అసెంబ్లీ నుండి ఎమ్మెల్యేగా పోటీచేయడానికి ఒకరు కాదు… ఇద్దరు కాదు 13కు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. అధిష్టానం సీనియర్ నాయకులకు ప్రాధ్యానాథ ఇవ్వబోతుందా లేదా సర్వే ఆధారంగానా ? ఎమ్మెల్యే టికెట్ ను ఎవరికి ఇవ్వబోతుంది అనేది ప్రశ్నగా మిగిలింది. అదిష్టానం సరైన నాయకునికి, ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న వారికి టికెట్ కలిపిస్తే గెలుపు వైపు దూసుకెళ్లే ప్రభావం ఎక్కువగా ఉంది. బీజేపీ నేతలు కొన్ని సమావేశాల్లో తాండూరులో బీజేపీ గెలుపు ఖాయం, తాండూరు ప్రజలు బీజేపీని నమ్ముతున్నారు, కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పథకాలు ప్రజల్లోకి తెలియజేసి, బీజేపీ తోనే తాండూరు అభివృద్ధి చెందుతుందని అని  చెప్పుకొచ్చారు. వాస్తవానికి తాండూరు ప్రజలు అమాయకులని కొంతమంది అంటున్నారు. స్ధానిక ప్రజలు కూడా ఈ సారి తాండూరులో బీజేపీ గెలుపొందలని కోరుకుంటున్నట్లు సమాచారం ఉంది. కానీ కనీస గుర్తింపు, క్యాడర్ లేని నాయకులకు టికెట్ ను కేటాయిస్తే ఓటమి ఖాయం, డిపాజిట్లు కూడా రావని కూడా  చెప్పుకొచ్చారు. ఎందుకంటే సీనియర్ నాయకులకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు పేరున్న బడా నాయకులతో  పోటీగా గల్లీలలో గుర్తింపు లేని క్యాడర్ లేని బిజెపి నాయకులు టికెట్ ఆశించడం గమనార్హం.  బీజేపీ సిద్ధాంతాలపై సరైన అవగాహన లేని వారికి టికెట్ వస్తే ఇంకా తాండూరులో బీజేపీ దుకాణం సదురుకోవాలని అంటున్నారు. తాండూరులో ఈ సారి బీజేపీ గెలుపొందలంటే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, తాండూరు సమస్యలపై పోరాడుతూ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే నాయకునికి టికెట్ కనుగా అధిష్టానం కేటాయిస్తే గెలుపొందే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉండవచ్చు అని స్ధానిక ప్రజలు చెప్పుకొస్తున్నారు.  అదేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఒక వేళా దక్కకపోతే ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశాలు కూడా ఉండొచ్చని కూడా సమాచారం. అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిని ఖరారు చేసేవరకు వీరి తాపత్రయం ఆగేలా లేదని అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News