Sunday, September 8, 2024
Homeపాలిటిక్స్Telangana Budget sessions: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ

Telangana Budget sessions: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ

భద్రత, రక్షణ వ్యవహారాల్లో గట్టి చర్యల కోసం

ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభం కానున్న తెలంగాణ శాసన సభ, శాసన మండలి సమావేశాలు సజావుగా సాగేందుకు ముందస్తుగా అధికారులతో , పోలీస్ ఉన్నత అధికారులతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ..

👉శాసన మండలి, శాసన సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇవ్వాలి.

👉ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి , సమావేశాలు సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలి .

👉అధికారులు తప్పకుండా ఆఫీసర్ బాక్స్ లో ఉండేలా చూడాలి.

👉ముఖ్యమంత్రి సూచన మేరకు పాత అసెంబ్లీ భవనంలోకి శాసన మండలిని మార్చాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక పరమైన వ్యవహారాలు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం.

👉ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలి.

👉అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ధర్నాలు, ర్యాలీలు జరిగే అవకాశాలు ఉన్నవి. అలర్ట్ గా ఉండాలి.

👉లాబీల్లోకి విజిటర్స్ గుంపులు గుంపులుగా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

👉ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూస్కోవాలి.

ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, విప్ లు అడ్లూరి లక్ష్మణ్, బీర్ల ఐలయ్య, సీఎస్ శాంతి కుమారి, డిజిపి రవి గుప్తా, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా. నరసింహా చార్యులు, లేజిస్లేచర్ అడ్వైజరీ ప్రసన్న కుమార్, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News