తెలంగాణ టీడీపీపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెడుతున్నారు. టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు మొదలుకాగా ఇప్పటికే ఈ అధ్యక్ష పదవి రేసులో బాబు మోహన్, తీగల క్రిష్ణారెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ దూసుకుపోతున్నారు. నెల రోజుల క్రితం చంద్రబాబును కలిసిన బాబు మోహన్ రెండ్రోజుల క్రితమే టీడీపీ సభ్యత్వం తీసుకుని సొంత గూటికి వెళ్లారు. బాబు మోహన్ రాకతో మరోమారు వివిధ పార్టీల్లోని మాజీ టీడీపీ నేతలు మళ్లీ ఘర్ వాపసీకి రెడీ అవుతున్నట్టు స్పష్టమవుతోంది.
స్థానిక ఎన్నికల్లో బహుముఖ పోటీ..
ఇప్పటికే చంద్రబాబును కలిసి పార్టీలో చేరతానని చెప్పిన తీగల కృష్ణారెడ్డి మరోరెండు రెండ్రోజుల్లో టీడీపీలో చేరనున్నట్టు తాజాగా తీగల కృష్ణారెడ్డి వెల్లడించారు. జీహెచ్ఎంసీ, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో తెలంగాణ టీడీపీ ఉండటంతో ఈసారి తెలంగాణలో స్థానిక ఎన్నికల వేడిని ముందే హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఉండగా ఇప్పుడు టీడీపీ కూడా స్థానిక ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొత్తానికి రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ద్విముఖ పోటీ, త్రిముఖ పోటీ కాకుండా బహుముఖ పోటీ ఖాయమని టీడీపీ తేల్చేసింది.
టీడీపీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి.