కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం రాహు కేతువులుగా దాపురించాయని మాజీ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్ తులసి రెడ్డి ధ్వజమెత్తారు. నంద్యాలలో నంద్యాల పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జే లక్ష్మీ నరసింహ యాదవ్ అధ్యక్షతన నంద్యాల జిల్లా కార్యాలయంలో తులసి రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి దేశాన్ని అప్పుల భారత్ చేసింది అన్నారు. 1947 నుంచి 2014 వరకు 67 సంవత్సరాలలో పండిట్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం 46 లక్షల కోట్లు అప్పు చేయగా 2014 నుంచి 2023 వరకు కేవలం 9 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం 109 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసింది అన్నారు.
దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది అన్నారు. ఇండియా ఇస్ ఫర్ సేల్ అన్నట్టుంది గత ప్రభుత్వాలు సంపాదించిన ప్రభుత్వ ప్రైవేటు రంగా సంస్థల ఆస్తులను మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది విమానాశ్రయాలు రైల్వే స్టేషన్లను ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసి లాంటి సంస్థలను అమ్మకానికి పెట్టిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసింది ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ ఖంద్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కడప జిల్లాలో SAIL ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలికింది దుగ్గరజపట్నం ఓడరేవు ను విస్మరించింది పోలవరం ప్రశ్నార్థకం అయ్యింది విజయవాడ విశాఖ మెట్రో ఉసెలేదు విశాఖ కొత్త రైల్వే జోన్ లేదు విశాఖ ఉక్కు కర్మాగారన్ని అమ్మకానికి పెట్టిందన్నారు.