మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎంపీ బీబీ పాటిల్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ కొత్త విషయాలను వివరిస్తోంది. అసలు అప్పట్లో సీఎంగా ఉండి కూడా కేసీఆర్ ఎందుకు ప్రధాని మోడీని కలవలేదనే విషయాన్ని తాజాగా వివరించారు .మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి ప్రధాని మోడీ కలవడాన్ని స్వాగతిస్తున్నామంటూ మీడియాతో మాట్లాడిన వినోద్.. తెలంగాణ రాష్ట్ర సమస్యలను ప్రధాని మోడీకి వివరించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించడం చాలా సంతోషమని..…తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో వివరించిన నిధుల విషయంలో చాల సార్లు కేసీఆర్ మోడిని కలిశారని వినోద్ చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ప్రధాని మోడీ కలిసిన ప్రతిసారీ చూస్తామని చెప్పారు తప్పా ఒక్క రూపాయి ఇవ్వలేదని.. విభజన చట్టంలో ముఖ్యంగా రహదారులు విషయంలో ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా ఒక్క హామీ కేంద్రం నెరవేర్చలేదని వినోద్ భగ్గుమన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రతిసారి మోడీ అన్యాయం చేశారని, ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాట చెయ్యాల్సిన అవసరం ఉన్నదంటూనే..కేసీఆర్ హయాంలో ఎక్కడా తాత్సారం చెయ్యలేదని, కేసీఆర్ వందల లేఖలు మోడీకి రాష్ట్ర సమస్యలపై, నిధులపై రాసినా.. పట్టించుకోనందునే కేసీఆర్ అప్పటి నుండి మోడీని కలవలేదన్నారు వినోద్.