Saturday, February 22, 2025
HomeఆటAmerica: భారత జట్టు రికార్డును బ్రేక్ చేసిన అమెరికా

America: భారత జట్టు రికార్డును బ్రేక్ చేసిన అమెరికా

అమెరికా(America) క్రికెట్ టీమ్ అరుదైన రికార్డు సృష్టించింది. ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో ఎదుగుతున్న అగ్రరాజ్యం జట్టు తాజాగా 40 ఏళ్ల నాటి రికార్డును బ్రేక్ చేసింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ (2023-27)లో భాగంగా ఒమన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 122 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన ఒమన్ జట్టును కేవలం 65 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో అతి తక్కువ పరుగులను డిఫెండ్ చేసిన తొలి జట్టుగా అవతరించింది.

- Advertisement -

అంతకుముందు 1985లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బౌలింగ్‌లో అదరగొట్టి దాయది పాక్‌ను 87 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో అప్పటి నుంచి ఈ రికార్డు టీమిండియా పేరు మీద ఉంది. తాజాగా అమెరికా జట్టు ఈ రికార్డును బ్రేక్ చేసి శభాష్ అనిపించింది. మరో విశేషం ఏంటంటే ఒమన్ జట్టు 25.3 ఓవర్లు ఎదుర్కొంటే ఆ 25 ఓవర్లూ స్పిన్నర్లే వేశారు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక జట్టు పూర్తి ఇన్నింగ్స్‌లో ఒక్క పేసర్ కూడా పేస్ బౌలింగ్ వేయకపోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో 20 వికెట్లలో 19 వికెట్లు స్పిన్నర్లే తీయడం మరో రికార్డు అని చెప్పుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News