మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు(Glenn Maxwell) బీసీసీఐ భారీ జరిమానా విధించింది. మ్యాక్స్‌వెల్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ కూడా చేర్చింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లో లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడని బీసీసీఐ తెలిపింది.
ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ కేవలం ఒక పరుగు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం క్రికెట్ పరికరాలు, అడ్వరైజింగ్ బోర్డులను కించపరిచాడు. ఐపీఎల్ ప్రవర్తన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం క్రికెటర్ పరికరాలు, బట్టలు, గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఇతర వస్తువులను అగౌరవపరచడం నేరం. ఈ ఉల్లంఘనలకు పాల్పడిన ఆటగాడికి ఓ మ్యాచ్ ఫీజులో కోతతో పాటు మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటారు.
ఇక ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. పంజాబ్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 39 బంతుల్లో సెంచరీ చేశాడు. అనంతరం ఛేదనలో చెన్నై 5 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేసింది.