India vs Pakistan Asia Cup 2025 Final: 2025 ఆసియా కప్ సూపర్-4 పోరులో పాకిస్థాన్ బంగ్లాదేశ్ పై గెలిచి ఫైనల్ కు చేరింది. తుదిపోరులో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లా పై 11 పరుగుల తేడాతో పాక్ గెలిచింది. 41 సంవత్సరాల ఆసియా కప్ చరిత్రలో 17 ఎడిషన్‌లు జరగగా..ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు తలపడటం ఇదే తొలిసారి. తాజాగా జరుగుతున్న ఆసియాకప్ టీ20 టోర్నీలో దాయాదులు మూడోసారి ఎదురపడున్నాయి. లీగ్, సూపర్-4 దశల్లో పాక్ పై భారత్ సులభంగా విజయం సాధించింది. మరోసారి దాయాదిని చిత్తుచిత్తుగా ఓడించేందుకు రెడీ అయింది.
ఎవరిది పైచేయి..
భారత్, పాకిస్తాన్ టీ20ల్లో ఇప్పటి వరకు 15 సార్లు ఒకదానితో ఒకటి తలపడగా.. టీమిండియా 12 సార్లు గెలిచింది. 2007 టీ20 ప్రపంచకప్ లో చిరకాల ప్రత్యర్థులు మెుదటిసారి తలపడ్డారు. ఈ మ్యాచ్ లో భారత్ గెలిచింది. దాని తర్వాత వన్డే ఫార్మాట్ లో జరిగిన 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో పాకిస్థాన్ టీమిండియాను ఓడించింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రెండు జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. ఈ రెండు జట్ల తుది సమరం సెప్టెంబర్ 28, ఆదివారం జరగబోతుంది. ఈ మ్యాచ్ ను భారత కాలమానం ప్రకారం, రాత్రి 8 గంటలకు జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక కానుంది. దాయాదుల పోరును సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనిలివ్ యాప్ లో వీక్షించవచ్చు.
Also Read: Asia Cup- ఆసియా కప్ లో బంగ్లా ఓటమి.. పాక్‌తోనే భారత్ ఫైనల్
భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, శివమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకు షర్మా సింగ్, జితేష్.
పాకిస్థాన్ జట్టు: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, మహ్మద్ వసీమ్ జూర్, సుఫియాన్, సుఫియాన్, సుఫియాన్ హసన్ నవాజ్


