Shubman Gill Injury Update: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. కోల్‌కతా టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయం దిశగా కొనసాగుతోంది. అయితే రెండో రోజు ఆటలో భారత్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అసలు గిల్ కు ఏమైంది, ఎందుకు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో టీమ్ ఇండియా బ్యాటింగ్ కు దిగింది. మెుదటి సెషన్‌లో వాషింగ్టన్ సుందర్ ఔట్ అయిన తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. రెండు బంతులు ఆడిన తర్వాత మూడో బాల్ ను బౌండరీకి తరలించాడు. అయితే స్వీప్ షాట్ కొట్టిన వెంటనే అతని మెడలో తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. దీంతో వెంటనే అతడు హెల్మెట్ తీసేసి ఫిజియోను పిలిచాడు. మైదానంలోకి వచ్చిన ఫిజియో అతడిని పరీక్షించాడు. నొప్పి ఎక్కువ అవ్వడంతో అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. వెంటనే గిల్ ను కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. బహుశా అతడు రెండో ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ చేయడం కష్టమనిపిస్తోంది. ఇది భారత్ కు ఎదురుదెబ్బ అనే చెప్పాలి.
Also Read: Kuldeep Yadav -పెళ్లి కోసం లీవ్ అడిగిన కుల్దీప్ యాదవ్.. బీసీసీఐ ఇస్తుందా?
తొలి ఇన్నింగ్స్ లో గిల్ రిటైర్ హార్ట్ గా వెనుదిరగడంతో భారత్ ఇన్నింగ్స్ 9 వికెట్లు పడిపోవడంతోనే ముగిసింది. తాజాగా జరుగుతున్న టెస్టులో పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది. కెప్టెన్ బ్యాటింగ్ కు రాకపోతే రెండో ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియాకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గిల్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అందుతున్న సమాచారం ప్రకారం, అతడు రెండో టెస్టు కూడా ఆడటం డౌట్ అనే తెలుస్తోంది. భారత్, ప్రోటీస్ మధ్య రెండో టెస్టు గౌహతి వేదికగా నవంబర్ 21న ఆరంభం కానుంది.


