Sunday, November 16, 2025
HomeఆటKuldeep Yadav: పెళ్లి కోసం లీవ్ అడిగిన కుల్దీప్ యాదవ్.. బీసీసీఐ ఇస్తుందా?

Kuldeep Yadav: పెళ్లి కోసం లీవ్ అడిగిన కుల్దీప్ యాదవ్.. బీసీసీఐ ఇస్తుందా?

Kuldeep Yadav requests leave for his Marriage: టీమ్ ఇండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకోబోతున్నాడు. పెళ్లి నిమిత్తం అతడు బీసీసీఐ నుంచి సెలవు కోరాడు. కుల్దీప్ ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు ఎంపికయ్యాడు. నేటి నుండే తొలి టెస్టు కూడా మెదలుకానుంది.

- Advertisement -

కుల్దీప్ యాదవ్ పెళ్లి ఈ ఏడాది ప్రారంభంలోనే జరగాల్సి ఉండగా.. ఐపీఎల్ కారణంగా అది వాయిదా పడింది. కుల్దీప్ కు తన చిన్ననాటి స్నేహితురాలు వంశికతో జూన్ 4, 2025న లక్నోలో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ తోపాటు కుటుంబ సభ్యుల మరియు ఫ్రెండ్స్ హాజరయ్యారు. లక్నోకు చెందిన వంశిక ఎల్ఐసీలో పనిచేస్తోంది. వీరిద్దరి వివాహం నవంబర్ చివరి వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐను కుల్దీప్ సెలవు అడిగినట్లు తెలుస్తోంది.

విజయానికి చేరువలో టీమ్ ఇండియా..

ఇండియా టూర్ లో సౌతాఫ్రికా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడబోతుంది. ఈ క్రమంలో నవంబర్ 14 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా తొలి టెస్టు మెుదలైంది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. బుమ్రాకు ఐదు వికెట్లు దక్కాయి. టీమ్ ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 189 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ (39) టాప్ స్కోరర్. హార్మర్ కు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్ ప్రారంభించిన ప్రోటీస్ 35 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. జడేజా నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Also Read: ICC ODI Rankings-హిట్ మ్యాన్ కు అగ్రస్థానం.. టాప్-10లో నలుగురు మనోళ్లే..

ఇరు జట్ల ప్లేయింగ్ XI:
టీమ్ ఇండియా: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.

సౌతాఫ్రికా: ఎడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరిన్ (వికెట్ కీపర్), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్.

 

 

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad