ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ ఆటగాడు కుల్‌దీప్ యాదవ్ (Kuldeep Yadav).. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh)పై చేయి చేసుకున్నాడు. లైవ్ టీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అవడంతో కుల్‌దీప్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాచ్ అనంతరం కుల్‌దీప్, రింకూ, ఇతర ఆటగాళ్లు కలిసి మైదానంలో మాట్లాడుకుంటున్నారు. అయితే కుల్‌దీప్ ఉన్నట్టుండి రింకూ చెంపపై కొట్టాడు. దీంతో రింకూ ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఆ తర్వాత కుల్‌దీప్ మరోసారి కొట్టడంతో రింకూ అసహనానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుల్‌దీప్ ప్రవర్తనపై నెటిజన్లు మండిపడుతున్నారు. సహచర ఆటగాడిపై ఇలా చేయి చేసుకోవడం ఏంటని.. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.