Thursday, December 12, 2024
HomeఆటLakshetipeta: రాష్ట్రస్థాయి కరాటే పోటీలో లక్షేటిపేట విద్యార్థుల ప్రతిభ

Lakshetipeta: రాష్ట్రస్థాయి కరాటే పోటీలో లక్షేటిపేట విద్యార్థుల ప్రతిభ

కుంగ్ ఫూ అకాడమీ

మారుతున్న సామాజిక పరిస్థితుల్లో నూతన జనరేషన్ కు మార్షల్ ఆర్ట్స్ ఎంతైనా అవసరమని రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో లక్షేటిపేట విద్యార్థులు బంగారు, వెండి, కాంశ్య పతకాలు సాధించడం చాలా అభినందనీయమని డ్రాగన్ స్వార్డ్ కుంగ్ ఫూ అకాడమీ గ్రాండ్ మాస్టర్ రాజమల్లు పేర్కొన్నారు.

- Advertisement -

గురువారం ఉదయం పట్టణంలోని గురు నానక్ ఫంక్షన్ హాల్లో వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించిన విద్యార్థులను అయన అభినందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో అమ్మాయిలు ఉద్యోగం లేదా వివిధ పనుల రీత్యా ఒంటరిగా వేరే ఊళ్ళల్లో ఉండి పనిచేయాల్సి వస్తుందని, అందుకే అమ్మాయిలకు పోకిరీల నుండి మార్షల్ ఆర్ట్స్ మాత్రమే రక్షణగా ఉండి కాపాడుతుందని అన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో వివిధ విభాగాల్లో మెడల్స్ సాధించిన విద్యార్థులను ఆయన అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News