India’s Squad for Asia Cup: 2025 ఆసియా కప్ కు టైం దగ్గర పడింది. ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 9 మరియు 28 మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరగబోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగబోతున్న టీమిండియా సెప్టెంబర్ 10న దుబాయ్‌లో యూఏఈతో తలపడబోతుంది. దాయాది జట్ల అయిన భారత్, పాకిస్తాన్ టీమ్స్ సెప్టెంబర్ 14న తలపడబోతున్నాయి. సెప్టెంబర్ 19న ఒమన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ తన గ్రూప్-దశ మ్యాచ్‌లను ముగించనుంది. ఈ మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, యూఏఈ మరియు ఒమన్ అనే ఎనిమిది జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా ఫ్లేయింగ్ XI ఎలా ఉండబోతుందనేది భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రిడిక్ట్ చేశాడు.
ఇతడి ప్రకారం, అభిషేక్ శర్మ మరియు సంజు సామ్సన్ ఓపెనింగ్ చేస్తారు. తిలక్ వర్మ 3వ స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉంటారు. వైస్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్ 5వ స్థానంలోనూ, అతని తర్వాత హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో ఉంటారు. శివమ్ దూబే 7వ స్థానంలో, వాషింగ్టన్ సుందర్ 8వ స్థానంలో, కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో, అర్ష్‌దీప్ సింగ్ 10వ స్థానంలో, జస్‌ప్రీత్ బుమ్రా 11వ స్థానంలో ఉంటారు. కైఫ్ మరో నలుగురి ప్లేయర్స్ ను బ్యాకప్ గా ఎంచుకున్నాడు. శుభ్‌మాన్ గిల్ బ్యాకప్ ఓపెనర్‌గా, జితేష్ శర్మ బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉంటారు.మిగతా ఇద్దరు ఆటగాళ్ళు వరుణ్ చక్రవర్తి మరియు మహమ్మద్ సిరాజ్ ను తీసుకున్నాడు.
Also Read: Asia Cup 2025 – ఆసియా కప్ హిస్టరీలో ఎక్కువ టైటిళ్లు గెలిచింది ఎవరో తెలుసా?
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికగా జరగబోతుంది. వరల్డ్ కప్ కు ఇంకో ఆరు నెలల మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్‌ను 20 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. సాధారణంగా ఈ మెగా టోర్నీ రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. 2023లో వన్డే వరల్డ్ కప్ ఉన్న కారణంగా.. ఆ సంవత్సరం ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్ లో నిర్వహించారు. ఆ కప్ లో టీమిండియా టైటిల్ గెలుచుకుంది. ఇప్పటి వరకు ఆసియా కప్ ను భారత్ ఎనిమిది సార్లు గెలుచుకుంది.
Also Read: West Indies Vs Pakistan- చరిత్ర సృష్టించిన కరేబియన్ జట్టు.. 34 ఏళ్ల తర్వాత పాక్ పై తొలిసారి..!


