Sunday, November 16, 2025
HomeఆటMonsoon Regetta: రెగట్టాలో తెలంగాణ సెయిలర్లకు పథకాలు

Monsoon Regetta: రెగట్టాలో తెలంగాణ సెయిలర్లకు పథకాలు

సత్తా చాటిన మనోళ్లు

హుస్సేన్ సాగర్లో జరుతున్న మాన్‌సూన్ రెగట్టా జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌ చివరి రేసుల్లో తెలంగాణకు చెందిన ధరణి లావేటి, దీక్షిత కొమరవెల్లి బంగారు పతకాలు సాధించారు. అండర్-19 ఇంటర్నేషనల్ క్లాస్ మిక్స్‌డ్‌ విభాగంలో ధరణి లావేటి-మల్లేష్ వడ్ల జంట చివరి రేసులో స్వర్ణం సాధించడం పట్ల తెలంగాణ సెయిలింగ్ సంఘం అద్యక్షుడు డాడీ భోటే హర్షం వ్యక్తం చేశారు. చివరి రేసును సర్జన్ వైస్ అడ్మిరల్, వీఎస్ఎమ్ ఆర్టి సారిన్ జెండా ఊపి ప్రారంభించగా ముఖ్య అతిథిగా ఏవీఎస్ఎమ్, వీఎస్‌ఎమ్ పర్సనల్ ఇండియన్ నేవీ చీఫ్ వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad