క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కలుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీ ప్రాంతంలో గల ప్రగతి స్టేడియంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి.రాహుల్, సబావత్ మోతిలాల్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావులతో కలిసి ప్రభుత్వ అధికారులకు నిర్వహించిన ఐ.డి.ఓ.సి టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అనునిత్యం ప్రజా సేవలో నిమగ్నమై ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందించడం కోసం అహర్నిశలు విధులు నిర్వహిస్తామని, ఇటీవల జిల్లాలో నెలకొన్న వరద పరిస్థితులలో అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ విశిష్ట సేవలు అందించారని అన్నారు.
మానసిక ఒత్తిడి, పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహించామని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరకథ ఆరోగ్యం కలిగి ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.