Saturday, March 29, 2025
HomeఆటNZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్

NZ vs PAK: న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్

- Advertisement -

కెప్టెన్లు మార్చినా జట్టు మార్చినా పాకిస్థాన్ ఆటతీరు మాత్రం మారడం లేదు. కొత్త కెప్టెన్, జట్టుతో ఐదు టీ20ల సిరీస్ కోసం న్యూజిలాండ్ గడ్డ మీద అడుగుపెట్టిన పాక్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయింది. బుధవారం జరిగిన ఐదో టీ20లో న్యూజిలాండ్(NZ vs PAK) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో కివీస్ గెలవగా.. మూడో టీ20లో పాకిస్థాన్ గెలిచింది. నాలుగు, ఐదు టీ 20ల్లో న్యూజిలాండ్ గెలిచి 4-1 తేడాతో సిరీస్‌ను విజయవంతంగా ముగించింది.

ఇవాళ జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలలో 9 వికెట్ల నష్టానికి కేవలం 128 పరుగులు చేసింది. కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కడే 51 పరుగులు చేసి రాణించాడు. షాదాబ్ ఖాన్ 28 పరుగులు చేసి పర్వాలేదనిపించగా.. మిగిలిన బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఇక 129 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ ఛేజ్ చేసింది. కేవలం 10 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ 38 బంతుల్లోనే 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 5 కీలక వికెట్లు తీసిన జేమ్స్ నీషంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సిరీస్‌లో అద్భుతం రాణించిన టిమ్ సీఫెర్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News